WGL: గీసుకొండ మండలంలోని పలు గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.7.01 కోట్ల నిధులను మంత్రి కొండా సురేఖ మంజూరు చేశారు. ఈ సందర్భంగా మండల సర్పంచులు నేడు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు రడం భరత్, పేర్ల శ్రావణ్, బానోతు రాఘవేంద్ర, నాయకులు కార్తీక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మంత్రి సురేఖకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచులు


