హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

BDK: పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్త్‌కేర్‌ విభాగంలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ పద్మ తెలిపారు. 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై, నెట్‌/సెట్‌/పీహెచ్‌డీ అర్హతతోపాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈనెల 27న సాయంత్రం 4గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.