హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు మరమ్మతులతో ట్రాఫిక్ మళ్లింపు

NTR: షేర్ మహమ్మద్ పేట గ్రామం వద్ద జాతీయ రహదారి-65పై రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాలను షేర్ మహమ్మద్ పేట గ్రామం మీదుగా మళ్లిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ సిబ్బందితో కలిసి రోడ్డు పక్కన అడ్డుగా ఉన్న చెట్లను తొలగించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టారు.