హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SLASపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం

అన్నమయ్య: మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో SLAS (స్టేట్ లెర్నింగ్ అచీవ్‌మెంట్ సర్వే)పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ డా. సుబ్రమణ్యం పాల్గొన్నారు. జిల్లాలోని 25 మంది మండల విద్యాశాఖ అధికారులు, 305 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు హాజరయ్యారు. 5, 7, 9వ తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, గణితంలో పరీక్ష నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.