ASR: కొయ్యూరు సీఏహెచ్ పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహిస్తున్న శిక్షణలో మంగళవారం సీఐ బీ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. బాలల భద్రత, మహిళల రక్షణపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నివారణ, బాలల వేధింపులు, బాల కార్మికలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. బాలికలకు వివాహం చేయడం చట్టవిరుద్ధమని, బాలలపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే తమకు సమాచారం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలల భద్రతపై అవగాహన


