హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాల కోసం మర్రిపాడులో పూజలు

నెల్లూరు: మర్రిపాడు మండలంలోని పొంగూరు కండ్రిక గ్రామం ఉమామహేశ్వర స్వామి దేవాలయం, వెంకయ్య స్వామి ఆశ్రమంలో మంగళవారం మంగళ గౌరీ దేవికి సహస్రనామార్చన, వరుణ యాగం, వరుణ జపం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.