హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మిలాద్-ఉన్-నబీ వేడుకలు ప్రశాంతంగా జరపాలి'

VKB: మిలాద్-ఉన్-నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు. పండుగ నేపథ్యంలో పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఊరేగింపులు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.