హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోడల్ స్కూల్ హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

MLG: విద్యార్థులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తప్పవని మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. తుంగపాడు తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారన్న ఫిర్యాదులపై ఈరోజు ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్, పాఠశాల పరిసరాల పరిశీలించారు. విద్యార్థులతో పనులు చేయించడం సహించేది లేదని హెచ్చరించారు.