హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘జోగికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు’

KRNL: బీసీల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా ఇవాళ కర్నూలు బీసీ భవన్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగినప్పుడు స్పందించని జోగి రమేశ్ ఇప్పుడు బీసీ కార్డు వాడటం సరికాదన్నారు.