హైదరాబాద్: 28°C
తెలంగాణ

​వన మహోత్సవంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే

VKB: తాండూరు మెడికల్ (నర్సింగ్) కళాశాల ఆవరణలో నిర్వహించిన 'వన మహోత్సవం'లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడంపై కూడా శ్రద్ధ పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.