హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపండి'

KDP: సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, మార్పులు ఉంటే ఈ నెల 28లోగా తెలియజేయాలని పంచాయతీ కార్యదర్శి సునీల్ సూచించారు. గ్రామంలో మొత్తం 1,370 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో బీసీలు 1,066, ఎస్టీలు 55, ఎస్సీలు 85 మంది ఉన్నారని పేర్కొన్నారు. అభ్యంతరాలను ఫారం-2 ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.