హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్నా నది వద్ద ప్రమాదం.. జాగ్రత్త: ఎస్సై

KDP: పెన్నానదికి కుందు నది నుంచి భారీగా నీరు చేరుతున్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్ధవటం ఎస్సై హారిక సూచించారు. పెన్నా నదిలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. లింగంపల్లి, మాచుపల్లి, మూలపల్లి, వంతాటిపల్లి గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.