హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగులో ఉచిత వైద్య శిబిరం

MLG: ములుగులోని ప్రాణమ్ డే కేర్ సెంటర్‌లో మంగళవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. లబ్ధిదారులకు వైద్యపరీక్షలు, నర్సింగ్, ల్యాబ్ సేవలను ఉచితంగా అందించారు. డాక్టర్ శివాజీ, ఇంటర్న్ శ్రీకర్, నర్సింగ్ ఆఫీసర్ సాయి చంద్, ల్యాబ్ టెక్నీషియన్ సురేష్ సేవలందించారు. అధికారులు, లబ్ధిదారులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.