IPL ఆరంభం నుంచి CSKతో కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ ఆ ఫ్రాంచైజీలో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తొలుత 25 శాతం, ఆ తర్వాత 20 శాతం వాటా కోరగా.. కేవలం 3 శాతం మాత్రమే ఇస్తామని యాజమాన్యం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదని, కేవలం మాటపూర్వకంగానే ఈ ప్రతిపాదనలు నడిచినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
క్రీడలు
CSKలో వాటాల కొనుగోలుకు ధోనీ ఆసక్తి..?


