హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ సర్వేను పరిశీలించిన తాసిల్దార్

KMR: బిక్కనూరు మండలం ఈసన్నపల్లిలో కొనసాగుతున్న భూ సర్వేను తహసీల్దార్ సునీత మంగళవారం పరిశీలించారు. సర్వే తీరుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామ సరిహద్దులను కచ్చితంగా గుర్తించి, సర్వేను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నజీముద్దీన్ పాల్గొన్నారు.