హైదరాబాద్: 28°C
క్రీడలు

లంచ్‌ బ్రేక్‌.. శ్రీలంక స్కోర్‌ ఎంతంటే?

భారత్ - శ్రీలంక రెండో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట కొనసాగుతోంది. లంచ్‌బ్రేక్‌ సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో లంక జట్టు కమిల్‌(19), కమిందు (32) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో పసిందు(65), ధనంజయ(5) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఆతిథ్య జట్టు ఇంకా 373 పరుగులు వెనుకంజలో ఉంది.