హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారుల కిడ్నాప్.. గంటల్లోనే నిందితుడి పట్టివేత

HYD: గచ్చిబౌలిలో ఇద్దరు చిన్న పిల్లల కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. దీంతో ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌కు గురైన ఇద్దరు పిల్లలను క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఆ లేబర్ క్యాంప్ లోనే పనిచేస్తున్న వ్యక్తి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.