హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వ్యక్తిగత పరిశుభ్రతతోనే అనారోగ్య సమస్యలకు చెక్'

SKLM: ఆమదాలవలస పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలను మంగళవారం మున్సిపల్ కమిషనర్ టీ. రవి సందర్శించారు. ఈ మేరకు పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్ తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని సూచించారు.