హైదరాబాద్: 28°C
వార్తలు

గ్లోబల్ పేమెంట్స్‌లో యూపీఐదే హవా

అంతర్జాతీయ రియల్ టైమ్ చెల్లింపుల పరిమాణంలో యూపీఐ ఏకంగా 49% వాటాను దక్కించుకుందని IMF పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూఏఈ, ఫ్రాన్స్, సింగపూర్, శ్రీలంక, మాల్దీవులు సహా మొత్తం 11 దేశాల్లో యూపీఐ సేవలు విస్తరించాయి. రోజుకు 66 కోట్లకు పైగా లావాదేవీలతో భారత చెల్లింపుల నెట్‌వర్క్ ప్రపంచ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.