హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుమారుడితో గొడవ.. వృద్ధురాలు అదృశ్యం

MDK: శివ్వంపేట మండలంలోని పోతులబోగుడ గ్రామానికి చెందిన బత్తుల పెంటమ్మ (60) అదృశ్యమయ్యారు. చిన్న కుమారుడితో మనస్పర్థలు రాడవంతో ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయారని ఎస్సై తెలిపారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో కుమార్తె శివలక్ష్మి పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.