NRPT: దామరగిద్ద మండలంలోని గడిమున్కన్పల్లి, కానుకుర్తి తదితర గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. ఉడుమల్‌గిద్ద పంప్‌హౌస్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో ఈ అంతరాయం ఏర్పడిందని భగీరథ అధికారులు తెలిపారు. మంగళవారం నాటికి మరమ్మతులు పూర్తిచేసి, బుధవారం నుంచి యథావిధిగా నీటి సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం


