హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్యభట్ట స్కూల్ వార్డెన్, యాజమాన్యంపై కేసు నమోదు

MHBD: తొర్రూరు మండలంలోని ఆర్యభట్ట పాఠశాల విద్యార్థి హిమాంశు సోమవారం ఆత్మహత్యయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థి తండ్రి రవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆర్యభట్ట పాఠశాల వార్డెన్, యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం హిమాంశు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.