ASF: దహెగాం మండలం కుంచవెల్లి ప్రధాన రహదారి గుంతలు ఏర్పడి బురదమయమై అద్వానంగా మారింది. తారు రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను మట్టితో పూడ్చడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు బురదమయమై వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు గుంతలను పూడ్చి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: గుంతలతో అద్వానంగా మారిన రహదారి


