హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధురాలిపై కోతుల గుంపు దాడి.. తీవ్ర గాయాలు

JN: జిల్లా వెంకిర్యాల గ్రామంలో కోతుల గుంపు దాడిలో బాలగుని పద్మ (60) తీవ్రంగా గాయపడ్డారు. ఆరుబయట పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కోతులు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన ఆమెను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామాల్లో పెరుగుతున్న కోతుల బెడదను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.