హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా?

తలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కొన్ని చిట్కాలు పాటిస్తే డాండ్రఫ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వారానికి 2-3 సార్లు యాంటీ-డాండ్రఫ్ షాంపూ వాడాలి. తలకు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు లేదా ఉసిరి రసంతో ప్యాక్ వేయడం వల్ల కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వేడి నీళ్లతో తలస్నానం చేయడం తగ్గించాలి. పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి.