హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మంచిమాట: ప్రశాంతంగా తినడమే ఆరోగ్యం

ఆహారం తీసుకునే ముందు ప్రార్థన చేయడం లేదా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ నేడు చాలామంది ఫోన్లు చూస్తూ, ఒత్తిడితో తింటూ అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు. భోజనానికి ముందు ప్రశాంతంగా ఉండటం, దీర్ఘశ్వాస తీసుకోవడం వంటివి చేయడం వల్ల శరీరం ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.