హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైవేట్ కారుకు పోలీస్ సైరన్ అమర్చిన వారిపై కేసు నమోదు

ADB: నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ కారుకు అక్రమంగా పోలీస్ సైరన్ అమర్చుకుని పోలీస్ వాహనంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన గుగులోత్ రాజేశ్ (26)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారు. అనుమతి లేకుండా పోలీస్ సైరన్, గుర్తులు లేదా బోర్డులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇచ్చోడ రూరల్ సీఐ సి.హెచ్.రమేశ్ హెచ్చరించారు.