WGL: కల్తీ ఆహారం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతోందని వరంగల్ సీపీ N. శ్వేత తెలిపారు. కల్తీ ముఠాలపై టాస్క్‌ఫోర్స్, H-FAST, ఫుడ్ సేఫ్టీ విభాగాలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయని చెప్పారు. ప్రజలు FSSAI ముద్ర ఉన్న ఆహార పదార్థాలనే కొనుగోలు చేయాలని సూచించారు. కల్తీ సమాచారం 112కు తెలియజేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
కల్తీ ఆహారంపై కఠిన నిఘా: CP


