హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వ్యవసాయ అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలి'

MNCL: వ్యవసాయ అధికారుల సూచన మేరకే రైతులు యూరియాను వాడాలని దండేపల్లి మండల వ్యవసాయ అధికారి అజిత్ కుమార్ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో రైతులు వేసిన వివిధ పంటలు ఎదుగుదశలో ఉన్నాయన్నారు. ఈ సమయంలో పంట మొక్కలకు యూరియా అవసరముంటుందని అన్నారు. అయితే వ్యవసాయ అధికారులు సూచించిన నిర్దేశిత ప్రమాణంలోనే యూరియాను వాడాలని ఆయన కోరారు.