హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లికి తల కొరివి పెట్టిన కూతురు!

KMR: జిల్లా కేంద్రంలో ఓ విషాదం చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు అడ్లూర్ ఎస్సీ కాలనీకి చెందిన పెరుమాండ్ల రాజమణి అనే మహిళ అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. ఆమెకు భూమవ్వ ఒక్కతే కుమార్తె కావడంతో తల్లికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించింది. మారుతున్న కాలంలో ఇలాంటి ఘటనలు సమాజంలో మార్పుకు నిదర్శన పలువురు అభిప్రాయపడుతున్నారు.