హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పెరిగిపోతుంది. మంగళవారం ఉదయం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 3,860 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. 206 క్యూసెక్కులు ఆవిరి నమోదయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీ)లకు గాను, ప్రస్తుతం ప్రాజెక్టులో 1401.32 అడుగుల (12.857 టీఎంసీ)ల నీటి నిల్వ ఉంది.