హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాచారంలో రూ.46 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం

RR: నాచారం డివిజన్‌లో రూ.46 లక్షల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోమవారం శ్రీకారం చుట్టారు. రామ్‌రెడ్డి నగర్‌లో సిమెంట్ రోడ్లకు రూ.30 లక్షలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.16 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.