KDP: తొండూరు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 33/11 కేవీ ఫీడర్ టవర్ వర్క్ పనులు చేపట్టనున్నట్లు ఏఈ బాలసంజీవులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భద్రంపల్లి, తొండూరు, మల్లెల సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


