KNR: ఉపాధి కార్యాలయంలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు తెలిపారు. రిలయన్స్ జియోలో 20 ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన 18-28 ఏళ్ల పురుష అభ్యర్థులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెజ్యూమ్, సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. 9908230384, 9963357250 నంబర్లను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
29న జాబ్ మేళా


