హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీ పాఠశాలల్లో ఘనంగా సద్గమయ ప్రారంభం

TPT: తిరుపతి విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే సద్గమయ కార్యక్రమం లక్ష్యమని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా.మేడసాని మోహన్ తెలిపారు. 7 టీటీడీ పాఠశాలల్లో 1,678 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 27 వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేదాలు, నీతి పద్యాలు, సుభాషితాల ద్వారా విద్య అందిస్తున్నామన్నారు.