హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్-పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ADB: ఈ నెల 30న జరగనున్న నీట్-పీజీ 2026 ప్రవేశ పరీక్షను ఎలాంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మావల నలంద కళాశాలలో 100 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని కలెక్టర్ తెలియజేశారు.