హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటుకు ఆహ్వానం

మంచిర్యాల జిల్లాలో డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహించేందుకు అర్హత కలిగిన ఆసక్తిగల స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన సంస్థలు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.