హైదరాబాద్: 28°C
తెలంగాణ

1,246 మందికి నియామక పత్రాల పంపిణీ

KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన 1,246 మంది నిరుద్యోగ యువతీ యువకులకు నియామక పత్రాలు అందజేశారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మా రెడ్డి రజిత వెంకటరామిరెడ్డి పత్రాలను పంపిణీ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే మేళా ఏర్పాటు చేశారని కొనియాడారు.