SKLM: సోంపేట-బారువ మార్గంలో కంబ, అమరవీరుల స్థూపం వద్ద చనిపోయిన పశువులను పడేయడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వాకింగ్ చేసేవారు, రైతులు ముక్కు మూసుకొని పనులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు కళేబరాలను పొలాల్లోకి లాగడం, మందుబాబులు సీసాలు వేయడంతో సమస్య మరింత తీవ్రమైందని, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పశువుల కళేబరాలతో ఇబ్బందులు


