హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్ నివారణకు దండయాత్ర 2.0 ప్రత్యేక కార్యక్రమం

NTR: తిరువూరులో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులు సోమవారం “దండయాత్ర–2.0” ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా బృందాలు గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై నిఘా పెంచాయి. సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచి, వినియోగంపై రూ.1,500, విక్రయాలు, సరఫరాపై రూ.5,000 ప్రోత్సాహకం అందిస్తామని పోలీసులు తెలిపారు.