హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు బస్సు నడిపించాలని వినతి

SRCL: సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేట మీదుగా సిద్దిపేటకు పల్లె వెలుగు బస్సు నడపాలని ప్రజావాణిలో సోమవారం వినతి అందింది. మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. రోజూ మూడు ట్రిప్పులు నడిపితే వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట ప్రజలకు దూరం, సమయం ఆదా అవుతుందన్నారు. వినతిని ఆర్టీసీకి పంపుతామని ఎంపీడీఓ హామీ ఇచ్చారు.