హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్‌తో కుటుంబ భద్రతకు ఆదర్శం

కృష్ణా: చెన్నై-కోల్కతా హైవేపై ప్రయాణిస్తున్న ఓ కుటుంబం అందరి దృష్టిని ఆకర్షించింది. ఉంగుటూరు (మం) తేలప్రోలు సమీపంలో సోమవారం బైక్‌ నడుపుతున్న వ్యక్తి తాను హెల్మెట్‌ ధరించడంతో పాటు భార్య, పిల్లలకు కూడా హెల్మెట్లు పెట్టించారు. పలువురు ఈ దృశ్యాలను కెమెరాలు బంధించారు. హెల్మెట్‌ బరువు కాదు.. బాధ్యత, కుటుంబ రక్షణ కవచమని చాటి చెప్పారు.