హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా ముగిసిన వాడపల్లి శ్రీవారి పవిత్రోత్సవాలు

కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మూడో రోజు వైభవంగా నిర్వహించారు. సంకల్పం, విష్వక్సేన పూజ, మహాశాంతి, ప్రాయశ్చిత్త హోమాలు, మహదాశీర్వచనం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మూడు రోజుల పాటు వైదిక సంప్రదాయాలతో నిర్వహించిన పవిత్రోత్సవాలు సోమవారం రాత్రి మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.