హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎంఆర్ ధాన్యం మాయం'

WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని సాయి గణేష్ ఇండస్ట్రీస్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు రాష్ట్ర విజిలెన్స్ అధికారులు సోమవారం నిర్ధారించినట్లు తెలిపారు. అధికారులు రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అవకతవకలను గుర్తించారు. దీనిపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు.