హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ భవనానికి పూజా కార్యక్రమం

SRD: గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ కార్యాలయ ముఖద్వారానికి సోమవారం పూజా కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కొత్తకొండ భాస్కర్ మాట్లాడుతూ పంచాయతీ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. త్వరలో మహిళా భవనం, ప్రధాన రహదారి, వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడతామని తెలిపారు.