హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రొయ్యల చెరువులో మృతదేహం కలకలం

కోనసీమ: అంబాజీపేట మండలం తొండవరం గ్రామంలో రొయ్యల చెరువులో సోమవారం మృతదేహం కలకలం రేపింది. బోడసకుర్రు పల్లిపాలెంకి చెందిన ఓలేటి రాజు(40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం ఐదు గంటలకు చెరువు పనుల కోసం యజమాని శ్రీనివాసరావు రాజును తీసుకెళ్లాడని, మృతి చెందిన విషయం కూడా తమకు తెలియజేయలేదని, ఈ ఘటన పై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు.