హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోనేరు పాఠశాలలో ఎంఈఓ తనిఖీ

GDWL: అలంపూర్ మండలం కోనేరు ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎంఈఓ ఆర్. అశోక్ కుమార్ సందర్శించారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. విద్యార్థులు చదవడం, రాయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్రమశిక్షణతో ఉంటూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.