హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: చక్రపాణి

MLG: క్వారీల వ్యవహారంలో తనపై ప్రాణాంతక దాడికి కుట్ర జరిగిందని MLG జిల్లా BRS నేత చక్రపాణి ఆరోపించారు. చెరుకూరు, టేకులగూడెం ప్రాంతాల్లోని ఇసుక క్వారీల విషయంలో కొందరు తనను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. మూడు కార్లతో వెంబడించి తన వాహనాన్ని ఢీకొట్టి, ధ్వంసం చేసి దాడికి యత్నించారని ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.