SKLM: నరసన్నపేట పట్టణం పెద్దపేటలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కొలువైన శ్రీ నూకాంబికా దేవి 23వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు ఇప్పిలి రమణ తెలిపారు. మంగళవారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలతో అభిషేకాలు, విశిష్ట పూజలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు.
వార్తలు
నేడు నూకాంబికా దేవి వార్షికోత్సవం


