హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవసరాలకు అనుగుణంగా బస్సులు నడపాలి'

AKP: ఏపీఎస్‌ఆర్టీసీ బదిలీల్లో భాగంగా అనకాపల్లి డిపో మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏ.రాజేశ్వరి సోమవారం అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని ఆమెకు సూచించారు. డిపో అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలన్నారు.